19 May, 2026 | 11:04 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

ప్రొఫెసర్ జయశంకర్ గొప్ప త్యాగశీలి

06-08-2025 02:18 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొత్తపల్లి జయశంకర్(Professor Jayashankar) అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసీస్ సంగువాన్ మాట్లాడుతూ,  అన్ని రంగాలలో వెనుకబడిన తెలంగాణ సమాజాన్ని  చైతన్య పరిచేందుకు  ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతుడైన  ఆయన తెలంగాణ సమాజానికి జరుగుతున్న అన్యాయాలను  చూసి చెలించి అన్ని దశల తెలంగాణ ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొని తన రచనలు, ప్రసంగాల ద్వారా తెలంగాణ సమాజాన్ని తట్టి లేపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి  ఊపిరి పోశారన్నారు. కాకతీయ యూనివర్సిటీ  వైస్ ఛాన్స్ లర్ గా వేలాదిమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మార్గదర్శక నిలిచారని  ఆయన అడుగుజాడల్లో తెలంగాణ సమాజ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, కలెక్టరేట్ ఏవో, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, టీఎన్జీవో, టీజీవో  నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.