06-08-2025 02:11:49 PM
మంథని, (విజయక్రాంతి): సింగరేణి అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారింది. పెద్దపల్లి-మంథని(Peddapalli-Manthani) ప్రధాన రహదారి రామగిరి మండలంలోని లద్నాపూర్ లో బ్లాస్టింగ్(Blasting)తో కుంగిన ఈ రహదారి ప్రమాదకరంగా ఉన్నపటికీ సింగరేణి అధికారులు (Singareni officials) మరమత్తులు చెయకపోవడంతో ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ప్రధాన రహదారి పై మంగళవారం సాయంత్రం మంథని మండలం ధర్మారం గ్రామానికి చెందిన తోకల కపిర్ తన ఆటోలో కుటుంబ సభ్యులతో వెములవాడ, కొండగట్టు వేళ్లి తిరిగి వస్తుండగా లాద్నాపూర్ బస్టాండ్ వద్ద ఓసిపి-3 దెబ్బలకు పెద్దపల్లి నుంచి మంథని కి ప్రయాణికులతో వస్తున్న ఆటో ప్రమాద వశాత్తూ రోడ్డుపై కుంగిన గుంతలో పడి పోవడం తో అదుపు తప్పిన ఆటో పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద ఉన్న బొర్డు కు ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కపిర్ కుమారుడు బిన్నుకు (16) తీవ్ర గాయాలయ్యాలు కాగా, కపిర్ తల్లికి తల పగిలింది. గాయాలతో రోదిస్తున్న వారిని స్థానికులు 108 లో పెద్దపల్లిలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రమాదాలు జరగక ముందే ప్రధాన రహదారికి సింగరేణి అధికారులు మరమ్మతులు చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.