01-08-2025 12:27:50 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
అలంపూర్ జూలై 31 మహిళా శక్తి సంఘాల సంబరాలు కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడుకి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాటలు యుద్ధం కొనసాగిం ది. గురువారం అలంపూర్ చౌరస్తాలోని ప్రై వేట్ ఫంక్షన్ హాల్ లో మహిళా శక్తి సంబరా ల కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు.ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ..
బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శలు చేశా రు. అంతకుముందు ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే విజయుడు జిల్లా కలెక్టర్ దృ ష్టికి తీసుకుని వెళ్ళాడు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరం మంత్రి మాట్లాడవలసి ఉండగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కు ఎలా మైక్ ఇస్తారన్నారు.
అదే సమయంలో బిఆర్‌ఎస్ పార్టీపై విమర్శలు చేస్తు న్న మార్కెట్ యార్డ్ చైర్మన్ మాటలకు అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు స్పందిస్తూ కాం గ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులకు లబ్ధిదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇంటి నిర్మాణం చేసుకుంటున్న లబ్ధిదారుల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. అ లాగే అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఇసుక ,మట్టి దందాలు జోరుగా సాగిస్తున్నారని ఆరోపణలు చేశారు.
దీంతో మంత్రి ఎదుటనే కాంగ్రెస్ నాయకులు విమర్శ ప్రతి విమర్శకు దిగారు.గొడవ తీవ్రతరం అవుతుండడంతో అక్కడ చేరుకున్న డిఎస్పి మొగులయ్య తన సిబ్బందితో కలిసి ఇరుపాటిల నాయకులను సర్దిచెప్పి గొడవలను సద్దుమణిగించారు. ఒక్కసారి మహిళా శక్తి సంఘాల సంబరాలు కార్యక్రమంలో ఎమ్మెల్యే మాటలు హార్ట్ టాపిగామిగిలిపోయాయి.