calender_icon.png 1 August, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ, 1.5 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

01-08-2025 12:27:45 AM

ఎల్లారెడ్డి, జులై 31,(విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సాయి రెడ్డి పేట మండలం టేకుల చెరువు తండాకు కొత్త బిటిరోడ్డు రూ.1.5 కోట్లు వ్యయంతో నిర్మించబడనున్న రోడ్డుకు గురువారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పనులకు శంకుస్థాపన చేశారు. PWౄ రోడ్డు నుండి టేకుల చెరువు తండా వరకు రోడ్ పనులను భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.

ఈ రహదారి టేకుల చెరువు తండా వరకు గ్రామ ప్రజలకు మరింత వాహన సదుపాయాలను కల్పించనున్నది, అని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, ప్రజల నిత్య జీవితాలను సౌకర్యవంతంగా మార్చే దిశగా మేము కట్టుబడి ఉన్నాం. ఈ రహదారి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడమే కాక, గ్రామ అభివృద్ధికి దోహదం చేస్తుంది, అని తెలిపారు.స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.