27-12-2025 06:36:25 PM
వికారాబాద్: జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో మున్సిపల్ అధికారులు మరియు ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో వార్డు ప్రజల తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇందిరమ్మ కోర్ కమిటీ సభ్యులు భీమ్ సింగ్ రాథోడ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
త్రాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువల పరిశుభ్రత నిరంతరాయంగా కొనసాగిస్తామని, దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో అర్హులైన పేదలకు అందిస్తామని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.