calender_icon.png 27 December, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలను దర్శించుకున్న ఐ అండ్ పిఆర్ అధికారి

27-12-2025 08:11:46 PM

అనంతరం ప్రత్యేక పూజలు 

అలంపూర్: ప్రముఖ ఐదవ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలను శనివారం ఉదయం ఐ అండ్ పిఆర్ అధికారి బి.గోవర్ధన్ సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి దర్శనానికి వచ్చిన సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ బి.గోవర్ధన్ వారి కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని, జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయం అర్చకులు ఆనంద శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు.