27-12-2025 08:01:04 PM
ఏర్గట్ల,(విజయక్రాంతి): మేకలు, గొర్రెలు కల్గిన రైతులు వాటికీ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత నట్టల నివారణ మందులను త్రాగించి మేకలు, గొర్రెల్లో నట్టలను నీవరించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ డీవీఏ హెచ్ఓ డాక్టర్ గంగాధరయ్య, మండల పశువైద్యధికారిని జి.రాజయలక్ష్మి బట్టా పూర్, తోర్తి గ్రామాల సర్పంచ్ లు బి.ప్రవీణ్ యాదవ్, కౌడ భూమేశ్వర్ ఉపసర్పంచ్ లు మూడ్ దయానంద్, సుమన్ గౌడ్ అన్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జీవలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేస్తె అవి ఆరోగ్యం గా ఉంటాయని, మేకలు, గోర్రెలు కల్గిన రైతులకు మంచి లాభం కలుగుతుందని, ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకువాలని వారు రైతుల ను కోరారు. ఈ కార్యక్రమం లో వార్డు సభ్యులు మాలోత్ భీమానాయక్, హుస్సేన్, పోకల్కర్ గణేష్, గ్రామస్తులు గణేష్ యాదవ్, గోరె మియా, గోజలా శ్రీకాంత్, ఆశన్న, మహేందర్ యాదవ్,మౌలానా, బాబూలాల్,సిబ్బంది ఎల్ ఎస్ ఏ నరేందర్, మధుకర్, తదితరులు,పాల్గొన్నారు.