18 April, 2026 | 4:39 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు...

30-04-2025 11:09 PM

ఇంద్రవెల్లి (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధనోర గ్రామం వద్ద రహదారిపై బుధవారం ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో శివరాజ్ పాటిల్ కాలు విరిగిపోగా, స్వరాజ్ అనే వ్యక్తికి  గాయాలైయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.