21 August, 2026 | 2:45 AM

పేదల సొంతింటి కలకు ఇందిరమ్మ ఇళ్లు అండ

21-08-2026 01:35 AM

గద్వాల టౌన్, ఆగస్టు 20: అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. తొలి విడతలో గద్వాల నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా, 2 వేలకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడతలో గుడిసెల్లో నివసించే వారికి 500 ఇళ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయం అందిస్తుందని తెలిపారు.