calender_icon.png 14 July, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గనుల వృత్తి శిక్షణ కేంద్రం భవనాన్ని ప్రారంభించిన జీఎం

14-07-2025 01:00:07 AM

ఇల్లెందు, జులై 13 (విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియాలోని యం.వి.టి.సి. కార్యాలయాన్ని 21 ఏరియా నుంచి 24 ఏరి యా లోని పాత డిస్పెన్సరీ హాస్పిటల్ లోకి మార్చినట్లు ఎంపీటీసీ మేనేజర్ పి.మహేశ్వర్ తెలిపారు. ఏరియా జనరల్ మేనేజర్ వి కృష్ణయ్య గనుల వృత్తి శిక్షణ కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జి ఎం మాట్లాడుతూ 21 ఏరియాలోని యం. వి.టి.సి. కార్యాలయాన్ని 24 ఏరియాలోని పాత డిస్పెన్సరీ కార్యాలయము నూతన హంగులతో తయారు చేయించి యం.వి .టి.సి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యాలయాన్ని ఉద్యోగులకు అతి సమీపంలో 24 ఏరియా లోనే ఉన్నదని తెలియజేస్తూ ఉద్యోగులు తమ శిక్షణా తరగతులను ఆనందంగా ఆహ్లాదంగా నేర్చుకోవడానికి డిజిటల్, నూతన ఫర్నిచర్స్ మరియు యల్.ఇ.డి. టి.వి. కూడా ఏర్పాటు చేషామన్నారు. గతంలో యం.వి.టి.సి. చాలా దూరంగా ఉండేదని ఇప్పుడు ఆ దూ రాన్ని మరింత దగ్గరగా చేసి 24 ఏరియాలో ఏర్పాటు చేశామని అన్నారు.

ముఖ్యంగా మహిళలకు యం.వి.టి.సి కి వెళ్లాలంటే చా లా ఇబ్బందిగా ఉండేది సాయంత్రం వేళలో మహిళలకు ఇబ్బందికరంగా అసౌకర్యంగా ఉండేది కనుక 24 ఏరియాలోకి యం.వి.టి. సి.ని మార్చడం జరిగింది కావున ఉద్యోగులు అందరు సద్వినియోగం చేసుకోగారని జి. యం. అన్నారు. ఈ కార్యక్రమంలో యస్వో టు జియం రామస్వామి, అధికారుల సం ఘం అధ్యక్షులు ఎ.జి.శివ ప్రసాద్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం జే.వెంకటేశ్వర్లు, ఇతర ఉన్నత అధికారులు ఏజియం(ఐఇ) గిరిధర్ రావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణ మోహన్, ఏరి యా ఇంజనీర్ ఆర్.వి,నరసింహ రాజు, డిజియం (సివిల్)రవి కుమార్, డిజియం (యఫ్&ఎ) మధుబాబు, డిజియం (ఏరియా వర్క్ షాప్) నాగరాజు నాయక్, రాం మూర్తి, దిలీప్ కుమార్, అంజి రెడ్డి, ఆర్. సుధాకర్, నాగేశ్వర్ రావు, శ్యాం ప్రసాద్, సుధాకర్, అజయ్, ఉద్యోగులు పాల్గొన్నారు.