22-05-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు/ కడ్తాల మే 21 : నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం, అమనగల్ మండలం సీతారాం నగర్ లో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇండ్ల భూమిపూజకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై మార్కెట్ చైర్మన్ యాట గీత నర్సింహా తో కలిసి ఆయా గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
అనంతరం ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. అదే విదంగా మక్తమాధారం నుంచి పెద్దిరెడ్డి చెర్వు తండా ( కడ్తాల్ ) మట్టి రోడ్డు పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్టంలో గుడిసెల్లేని రాష్టం గా మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదే విదంగా మక్తమాధారంలో పంచాయితీ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బిజెపి నాయకుడు యాదగిరి ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డిఈ సురేష్, ఎంపిడిఓ సుజాత, ప్రత్యేక అధికారి సీఈఓ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బీచ్యా నాయక్, జగన్, డిసిసి నాయకులు బీక్యా నాయక్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు బాల్ రాజ్, సింగల్ విండో డైరక్టర్ వెంకటేష్, నాయకులు పాల్గొన్నారు.