22-05-2025 12:00:00 AM
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పనులకు భూమి పూజలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు
ఎల్లారెడ్డి, మే 21 : లింగంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు భూ మన్న- మానసకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో బుధవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ మంజురు పత్రాలు, లబ్దిదారులకు అందచేసి ఇంటి నిర్మాణం కొరకు భూమి పూజ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కల కలగనే మిగిలిపోయింది.
గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3500 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి అని తెలిపారు. ప్రజలకు సొంత ఇంటి ఉండడం ఒక కల. ప్రజలు అందరు తమకు సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారు. ఇంటి నిర్మాణం
కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి భూమి పూజ చేసినందుకు చాల సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, వెంకటరామిరెడ్డి, ప్రాథమిక సహకార సంఘం ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ రాజు, టీపీసీసీ మైనార్టీ సెల్ నాయకులు రఫీయోదిన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఒకే వేదికపై మాజీ ఎమ్మెల్యేలు
ఎల్లారెడ్డి, మే 21 : ఒకే వేదికపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఒకే వేదికపై కనిపించారు. అయితే లింగంపేట మండలానికి చెందిన పరమళ్ళ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఒకే వేదికపై తాజా మాజీ ఎమ్మెల్యేలు ఇలా కనిపించడం జరిగింది. పార్టీలకతీతంగా ఇరువురు నాయకులు వచ్చి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు పొంది ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు పరుస్తుందని ప్ ప్రజా శ్రేయస్సు పభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు ఇతర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు