24-08-2025 12:44:40 AM
ములుగు, ఆగస్టు 23 (విజయక్రాంతి): మారుమూల గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమం చేపట్టిం దని రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు రానున్న రోజుల్లో అరులైన వారందరికీ ఇం దిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
శనివారం మండలంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ సందర్భంగా మంత్రి సీత క్క మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రహదారులను విస్తరిస్తున్నామన్నా రు. రాష్ర్టంలోని ఇళ్లు నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.
ఇళ్లు మంజూరు కాని నిరేపేదలు ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మండలంలో ని బండరుపల్లి ఎస్సీ కాలనీ ప్రాంతంలో అంతర్గత సీసీ రోడ్లు (06 వర్క్స్)రూ.29 లక్షలతో, జాకరం ఎస్సీ ప్రాంతాల్లో అంతర్గత సీసీ రోడ్లు ,కాలువలు (11 పనులు) 58 లక్షల 50 వేల రూపాయలతో చేపట్టిన పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం రూ. 30లక్షల విలువ గల కొత్త మినీ బస్సును ప్రారంభించారు.
అలాగే మల్లంపల్లి మండలంలోని శ్రీనగర్ కొత్త గ్రామ పంచాయతీ భవనం శ్రీన గర్ 20 లక్షలు, శ్రీనగర్ లో సోక్ పిట్ 92 వేలు, ఎస్సీ ప్రాంతంలో అంతర్గత సీసీ రోడ్ల పనులు 61 లక్షలు, మహమ్మద్ గౌస్ పల్లి గ్రామంలో రోడ్లు , ఎస్సీ ప్రాంతాలలో కాల్వ లు 60 లక్షల 50 వేల రూపాయలతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు. 10 లక్షలతో నిర్మించిన స్లాబ్ డ్రైనేజ్ కల్వర్టు, మల్లంపల్లిలో 15 లక్షలతో నిర్మించిన విలేజ్ హాట్ (వెజిటబుల్ మార్కెట్)మంత్రి ప్రారంభోత్సవం చేశారు.