24-08-2025 12:45:24 AM
-ఈసారి జిల్లాలు, మండలాల్లోనూ ఘనంగా వేడుకలు
-బెస్ట్ టీచర్ల అవార్డులకు ఉపాధ్యాయుల నుంచి డిక్లరేషన్
హైదరాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): సెప్టెంబర్ 5న నిర్వహించే టీచర్స్ డేను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేప ట్టింది. రాష్ట్రస్థాయిలో మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించే టీచర్స్ డే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకాను న్నారు. అలాగే బెస్ట్ టీచర్స్ అవార్డులకు దరఖాస్తు చేసుకునే ఉపాధ్యాయుల నుంచి డిక్లరేషన్ తీసుకోనున్నట్లు డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
గతంలో ఒకట్రెండు సార్లు బెస్ట్ టీచర్స్ అవార్డులను తీసుకున్నవారే మళ్లీ పొందడంతో ఈ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పటివరకు తాము బెస్ట్ టీచర్స్ అవార్డును పొందలేదని ఈ మేరకు ఉపాధ్యాయుల నుంచి డిక్లరేషన్‌ను తీసుకోను న్నారు. ఇదిలా ఉంటే ఈసారి జిల్లాలు, మం డలాల్లోనూ టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన నిధులను కూడా మంజూరు చేయనుంది. జిల్లాకు రూ. 15వేలు, మండలానికి రూ.5వేల చొప్పున నిధులను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు నవీన్ నికోలస్ శనివారం తనను కలిసిన విలేకరులకు తెలిపారు.