calender_icon.png 25 May, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవాలి

24-05-2025 07:10:53 PM

బాన్సువాడ (విజయక్రాంతి): ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) సూచించారు. శనివారం పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు. ఐదు విడతల్లో నిర్మించుకున్న విధంగా బిల్లులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, నాయకులు నార్ల సురేష్, ఎజాజ్, ఖాలెక్ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

బాన్సువాడ పట్టణంలోని కోటగల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన వారు ఇళ్లు కట్టుకునేందుకు ముందుకొస్తే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, నాయకులు జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, ఖాలెక్, రోహిత్, నార్ల సురేష్, మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.