calender_icon.png 1 May, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు

01-05-2025 12:10:11 AM

బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 30(విజయ క్రాంతి): బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేష్ హెచ్చరించారు.బుధవారం రెబ్బెన మండలం నార్ల పూర్ గ్రామంలో మైనర్ బాలికకు వివాహం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆదేశాల మేరకు బాలల సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో వివాహాన్ని అడ్డుకొని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించా రు.

ఈ సందర్భంగా డీసీపీఓ మహేష్ మాట్లాడితే జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాలని కోరారు. బాల్య వివాహాల నిషేధ చట్టం  2006 ప్రకారం రూ.లక్ష జరిమానాతో పాటు రెండు సంవత్సరాల నాన్ బెయిలేబుల్ శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు.

బాల్య వివాహాలను ప్రోత్సహించడం కూడా నేరమని పేర్కొన్నారు.అమ్మాయిని సఖి కేంద్రానికి తరలించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో చైల్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ ఝాన్సీ రాణి, సిబ్బంది పాల్గొన్నారు.