01-05-2025 12:23:08 AM
అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్లో బుధవారం బసవేశ్వర జయంతి వేడుక లు అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు బసవేశ్వర మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బసవేశ్వ ర మహారాజ్ నాటి కాలంలోనే సమాజంలో అసమానతలను తొలగించి సమానత్వాన్ని నెలకొల్పేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడిన విప్లవాత్మక నాయకుడుగా ఆయనను కొనియాడారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వర ఆలోచనలు, విలువలను అనుసరించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, సీపీఓ జీవరత్నం, ఎస్సి కార్పొరేషన్ ఈ డి శంకర్, పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, డీపీఆర్ ఓ విష్ణు డీపీఎం శోభారాణి బీసీ సంక్షేమ శాఖ అధికారులు కాలిద్ సత్యనారాయణ రెడ్డి అధికారులు, వీరశైవ లింగాయత్ ప్రతినిధులు, లక్ష్మణ్ రమేష్ పటేల్ సిబ్బంది, రమేష్ షాహిబ్ రవికుమార్ పాల్గొన్నారు.