calender_icon.png 6 August, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తి చేయాలి

06-08-2025 12:19:51 AM

యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు 

యాదగిరిగుట్ట ఆగస్టు 5 (విజయ క్రాంతి ):  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. మున్సిపాలిటీ లో మొత్తం  ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, ఇంకా ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయ అని  తెలుసుకున్నారు.

ఇంకా నిర్మాణాలు ప్రారంభించ కుండా ఎన్ని ఉన్నాయని, అవి ప్రారంభించకపోవడానికి గల కారణాలు ఏంటి అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.  స్లాబ్ దశ పనులు జరుగుతున్న గుంటిపల్లి రేణుక ఇంటిని పరిశీలించారు. ఇంటి ని ఎన్ని స్క్వేర్ ఫీట్స్ లో  నిర్మాణం చేపట్టడం జరిగిందని  అని అడిగారు, మేస్త్రీ లకి స్క్వేర్ ఫీట్ కి 300 రూపాయలక కంటే ఎక్కువ ఇవ్వొద్దు అని కలెక్టర్ చెప్పటం జరిగింది. ఇటుక, సిమెంట్, స్టీల్ ఎక్కడ నుండి ఎంత ధరకు తెచ్చుకుంటున్నారు అని తెలుసుకున్నారు.ఇప్పటి వరకు నిర్మాణం జరిగినంత వరకు మీ అకౌంట్ లలో డబ్బులు జమ అయ్యాయా అని అడగడం జరిగింది.   సంబంధిత అధికారులు పాల్గొన్నారు.