06-08-2025 12:19:33 AM
బ్యాంకులకు సుమారు రూ.2,61,89,000 బురిడీ
ఒకే ఇంటిపై రూ.97,59,000 రుణం
జిల్లా ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి టౌన్, ఆగస్టు 05 : జల్సాలకు పోయి అత్యాశాతో ఓ పోలీసు కానిస్టేబుల్ రియాల్టర్ అవతారం ఎత్తాడు.అనుకున్నదే తడువు తాను ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి, పోలీసు శాఖలోని భద్రతా విభాగం లో ఉ న్న లొసుగులను ఆసరాగా చేసుకొని తోటి ఉద్యోగులను, పోలీసఅధికారులను,వ్యాపారస్తులను అధిక వడ్డీ ఆశా చూపాడు.ఒకే ఇం టిపై భద్రతా రుణం, నాలుగు బ్యాంకులలో నాలుగు మార్లు రుణం తీసుకున్న ఘనుడు, పోలీసు కానిస్టేబుల్ రాకేష్ (37) ను,తనతో పాటు ఆరు మంది నిందితులను వనపర్తి జి ల్లా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరుస్తునట్లు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు.
మంగళవారం సా యంత్రం వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మా ట్లాడుతూ 2023 సంవత్సరంలో పోలీసు శాఖ భద్రతా విభాగం,రుణాలకు సంబంధిం చి అవకతవకలు జరిగాయని అకౌంట్స్ ఆఫీసర్ కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రారంభించిన దర్యాప్తు లో భాగంగా వనపర్తి పట్టణం బండారు నగ ర్ కు చెందిన బండారు రాకేష్(37)తండ్రి కొండన్న 2007 సంవత్సరంలో గోపాల్ పేట్ పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు.
తక్కువ సమయం లో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో తన ఉద్యోగానికి లాంగ్ పెట్టి పూర్తిస్థాయిలో ఇల్లు కట్టి అమ్మించే వ్యాపారానికి చేసేవా డు.రాకేష్,వనపర్తి మండలం,చిట్యాల గ్రా మానికి చెందిన పోతుల హరీష్ (33)తండ్రి శ్రీనివాసులు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేష్ (32),అలిపూర్ గ్రా మానికి చెందిన కార్ డ్రైవర్ సుంకరి శేఖర్(33)తండ్రి వెంకటస్వామి,
వనపర్తి పట్టణం రాంనగర్ వీధికి చెందిన డాక్యుమెంట్ రైటర్ సందీప్ (31), శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఎల్‌ఐసి ఏజెంట్ బుక్ ఆ కిషోర్ కుమార్ 41 తండ్రి సత్యనారాయణ లతో కలిసి కుట్రపూరితంగా నకిలీ ఇంటి పత్రాలను సృష్టించి,ఒక ఇంటి పై ఒకసారి భద్రతా లోన్ మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్‌ఐసి లలో నాలుగు మార్లు సు మారు 89 లక్షల 30 వేల రూపాయలు మ రో ఇంటిపై భద్రత మరియు బ్యాంకుల ద్వా రా 75 లక్షల రూపాయలు మొత్తంగా సు మారు రెండు కోట్ల 60 ఒక లక్షల 89 వేల రూపాయలను రుణం తీసుకొని తమ జ ల్సాలకు ఆ డబ్బును ఖర్చు చేశామని తాము ఒప్పుకున్నట్లు ఎస్పీ చెప్పారు.
కొనసాగుతు న్న పూర్తి దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. కేసు ను ధర్యాప్తు చేస్తున్న వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వనపర్తి సీఐ కృష్ణ య్య అనేతృత్వంలో పట్టణ ఎస్త్స్ర హరిప్రసా ద్,సి.సి.ఎస్ ఎస్ ఐ రామరాజు,విజయకుమార్ ఏఎస్‌ఐలు రామకృష్ణ,హెడ్ కానిస్టేబు ల్ నగేష్ కానిస్టేబుల్ పురేందర్ గౌడ్ జిల్లా ఎస్పీ అభినందించారు.