అయ్యో పాపం.. పసిపాప!
17-05-2024 12:05 AM
వనస్థలిపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పుట్టీ పుట్టక ముందే ఒక పసికందు ప్రాణం కోల్పోయిన ‘వార్త’ మా హృదయాలను కలచి వేసింది. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్సలు చేయాలి. లేకపోతే, జూనియర్ డాక్టర్లు తెలిసీ తెలియని పద్ధతిలో ఒకటి చేయబోయి మరొకటి చేస్తే మనిషి ప్రాణాలకే ప్రమాదం. డెలీవరీ కాకముందే శిశువు బొడ్డుపేగును కట్ చేయడం వల్లే పసిపాప ప్రాణం ప్రమాదంలో పడినట్లు తెలుస్తున్నది. పేషెంట్లపట్ల బాధ్యతగా ఉండటం వైద్యుల కర్తవ్యం.
- వర్షిణి, పటాన్‌చెరు






