25-01-2026 12:05:24 AM
సమస్యలపై డిప్యూటీ మేయర్ తనిఖీ
సికింద్రాబాద్ జనవరి 24 (విజయక్రాంతి): హైదరాబాద్, జనవరి 24: ఉస్మా నియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొన్న పారిశుద్ధ్య లోపాలు, వీధి దీపాల అప్రయోజనకర స్థితి, రోడ్ల దయనీయ పరిస్థితి తదితర మౌలిక వసతుల సమస్యలపై శనివారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓయూ డివిజన్ ఏసీపీ జగన్, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు డిప్యూటీ మేయర్కు వివరణ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం అందిస్తామని శ్రీలత శోభన్ రెడ్డి భరోసా ఇచ్చారు.