ప్రభుత్వ బడి పిల్లలకు అక్షరాభ్యాసం
23-06-2026 01:20 AM
కుబీర్ జూన్ 22(విజయ క్రాంతి) నిర్మల్ జిల్లా బాసర ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాటలో పాఠశాలలు చేరిన పిల్లలతో పాటు చ దువుకునే పిల్లలకు ఉపాధ్యాయులు సోమవారం సామూహిక అక్షరా భ్యాసాన్ని నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వేద పండితుల సమక్షంలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించి పుస్తకాలు పెన్నులు పలకలు కొనిచ్చి నట్టు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.






