calender_icon.png 26 May, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతివృత్తుల ఆధునీకరణకు చొరవ చూపాలి

26-05-2025 12:20:30 AM

-పుస్తకావిష్కరణ సభలో మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్

ముషీరాబాద్, మే 25 (విజయక్రాంతి) : చేతివృత్తుల ఆధునీకరణ పలితాలు నిరుపేదలకు అందాలని, దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

వెనకబడిన తరగతుల సాధికారత సంస్థ ఆధ్వ ్యంలో ఆదివారం రాత్రి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  నిర్వహించిన కార్యక్రమంలో చేతివృత్తుల ఆధునికీకరణ ప్రత్యామ్నాయం పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ పుస్తకాన్ని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.ఈశ్వరయ్య, విశ్రాంత ప్రొఫెసర్ ఇసుకొండ తిరు మళి, రచయిత ఇంద్రవెళ్లి రమేష్ తో కలిసి దేవేందర్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడారు.

చేతివృత్తులు లేనిదే నేటి సమాజం లేదని ఆ వృత్తుల ఆధునీకరణతోనే దేశంలో నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవు తుందని, దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంట లిజెన్స్ దేశంలో చాలా మార్పులు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని ఈశ్వరయ్య మాట్లాడుతూ రాజ్యాధికారం సాధించిచినప్పుడే బీసీలు ఎదుర్కొంటున్న అన్ని సమ స్యలు పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 75 నామినేటెడ్ పోస్టులను బర్తీ చేయాగా 53 పోస్టులు అగ్రవరాలకు 22 పోస్టులు మాత్రమే జనాభాలో 56శాతం ఉన్నబీసీలకు కేటాయిం చారని ఆయనవిమర్శించారు.

చట్టం చేయకుండానే బీసీ కులగణన సర్వే చేశారని, తెలంగాణదేనిలో రోల్ మోడల్లో అర్ధం కావ డం లేదని ఆయన విమర్శించారు. చేతివృత్తులు ధ్వంసం నాటి ఆంగ్లేయుల నుంచి నేటి వరకు కొనసాగుతుందని ఆయన స్ప ష్టం చేశారు. చేతివృత్తుల ఆధునీకరణతో అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

విశ్రాంత ప్రొఫెసర్ తిరుమతి మాట్లాడుతూ, ప్రభుత్వాలు చేతివృత్తులపైనే ఆధారపడుతున్నాయని ఆయన స్పష్టం చేశా రు. ప్రభుత్వ ఆదరణ లేకున్నా చేతివృత్తులు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.