calender_icon.png 26 May, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

26-05-2025 12:21:24 AM

రామకృష్ణాపూర్: రైలు ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన రామకృష్ణాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే ఇన్వెస్టిగేషన్ అధికారి సంపత్(Railway Investigation Officer Sampath) తెలిపిన వివరాల ప్రకారం... ఆదివారం రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొనడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందడం జరిగిందని సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుని కుడి చేతిపై పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతుడు ఆత్మహత్యకు ప్రయత్నిచి ఉంటాడని అన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఇన్వెస్టిగేషన్ అధికారి సంపత్ తెలిపారు. వివరాలు తెలిస్తే ఈ క్రింద నంబరు 87126 58596, 83285 12176 సమాచారం ఇవ్వాలని కోరారు.