calender_icon.png 23 January, 2026 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల అరైవ్.. అలైవ్

23-01-2026 12:00:00 AM

రోడ్డు ప్రమాద రైత సమాజం కోసం పోలీసుల కృషి 

జిల్లావ్యాప్తంగా ఎస్పి ఆదేశాలతో ప్రత్యేక కార్యక్రమాలు 

విద్యార్థులకు ప్రజలకు ప్రత్యేక అవగాహన శిబిరాలు 

ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు 

జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలను కొనసాగుతున్న పోలీసులు 

బ్లాక్ స్పాట్ల సందర్శన, రోడ్డు సేఫ్టీ, డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కార్యక్రమాలు 

కామారెడ్డి జిల్లాలో వినూత్నంగా పోలీసుల చర్యలు 

కామారెడ్డి, జనవరి 22 (విజయక్రాంతి): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు జిల్లా వ్యాప్తంగా ప్రజలను చైతన్య పరుస్తున్నారు. జిల్లా ఎస్పీ రాజచంద్ర ప్రత్యేక కార్యక్రమాల కు రూపకల్పన చేశారు. దాంట్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది అధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజలను రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. పాఠశాల లు, కళాశాలలోని విద్యార్థుల కు అవగాహన కల్పిస్తున్నారు. వారు వినడమే కాకుండా వారి తల్లిదండ్రులను ఇళ్లలో రోడ్డు భద్రత సేఫ్టీ పై అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులు విద్యార్థులకు నచ్చ చెప్పుతున్నారు.

రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతే ఇంటిల్లిపాది అవస్థలు ఏ విధంగా పడతారో కొద్దిపాటి సమయస్ఫూర్తి వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాల భారి నుంచి బయట పడవచ్చు అని లేకుంటే కుటుంబం అంతా నష్టపోతుందనే విషయాలను విద్యార్థులకు, గ్రామాల్లోని ప్రజలకు పోలీస్ కళాజాత ద్వారా వివరించడమే కాకుండా పోలీస్ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. అరైవ్... ఆ లైవ్ అనే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విద్యాసంస్థల్లో పోలీసులు ఒక ఉద్యమంలాగా అవగాహన సదస్సులను ఏర్పాటుచేసి ప్రజలను చైతన్యవంతo చేస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించడంపై అవగాహన 

వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ రూల్స్ ను ఏ విధంగా పాటించాలి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారే వాహనాలను నడిపించాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపి ప్రమాదాలకు గురికావద్దని వివరిస్తున్నారు. చిన్నపిల్లలకు వాహనాలను ఇవ్వవద్దని సూచిస్తున్నారు. పల్లె సుద్దుల ద్వారా అవగాహన పాటల రూపంలో వివరిస్తున్నారు. ప్రతి మేజర్ గ్రామాల్లో అవగాహన సదస్సులను పోలీసులు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా వివరిస్తూ చైతన్యవంతం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సాగుతున్న రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక ప్రణాళికతో అవగాహన సదస్సుల నిర్వహిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.

రోడ్డు నిబంధనలు పాటించాలి 

వాహనాలు నడిపేవారు తప్పకుండా రోడ్డు నిబంధనలను పాటించి జాగ్రత్తగా ఉంటేనే కుటుంబానికి ఇబ్బందులు ఉండవని కళా రూపాల ద్వారా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు వివరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి కుటుంబాలు పడుతున్న కష్టాలను వివరిస్తున్నారు. కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదానికి గురై మరణిస్తే కుటుంబంలోని భార్యా పిల్లలు పడే ఇబ్బందులను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అరైవ్... అలైవ్. కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించాలని సూచించడంతో కామారెడ్డి జిల్లాలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సారథ్యంలో పోలీస్ శాఖ ప్రత్యేక బృందాల ద్వారా ప్రజలను రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చైతన్యవంతం చేస్తున్నారు. 

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి 

అరైవ్ లైవ్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలను చైతన్య వంతం చేయాలని పిలుపునిచ్చిందని దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ప్రజలు కూడా రోడ్డు భద్రత నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా సహకరించాలి. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో కుటుంబ పెద్ద మరణిస్తే ఎన్ని అవస్థలు పడుతున్నారా విషయాలను ప్రజలకు వివరిస్తున్నాం.

అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల స్పాట్లను పరిశీలిస్తున్నాం, ప్రజలకు అక్కడ వివరిస్తున్నాం, రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచిస్తున్నాం. ప్రభుత్వ, ప్రవేట్, సమస్తల్లో పనిచేస్తున్న వారికి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ప్రజలు సహకరించాలని కోరుతున్నాం.

రాజేష్ చంద్ర, ఎస్పీ, రాజేష్ కామారెడ్డి