14-01-2026 02:50:14 AM
బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ
మేడిపల్లి, జనవరి 13 (విజయక్రాంతి) : ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ కేంద్రాలను బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శైలజ మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కమీషనర్ ఆదే శాల మేరకు సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్ధాల ను నాచారం సెంటర్‌కు తరలించామని డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజ తెలిపారు. ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థల సేకరణ కేంద్రాలను బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజ, డిఇఇ కె. జాహ్నవి శశాంక్, ఎఇడి మహేష్, సానిటరీ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్విరన్మెంటల్ ఇంజనీర్స్ బాలమురళి కృష్ణ, నిఖిల్, వార్డ్ ఆఫీసర్స్, జవాన్లు, సిబ్బంది పాల్గొన్నారు.