calender_icon.png 14 January, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుంజుకుంటున్న బీజేపీ!

14-01-2026 02:51:59 AM

  1. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న నేతలు
  2. పట్టణ పార్టీగా ముద్రను చెరిపేసుకుని గ్రామీణ ప్రాంతాలకు చేరువ
  3. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): బీజేపీ గతంలో కంటే వేగంగా ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడుతూ తమదైన శైలిలో స్పందిస్తోంది. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపై వెనువెంటనే స్పందిస్తూ బలమైన గొంతును ప్రజల్లోకి తీసుకెళ్తున్నది. పార్టీలో కీలక నేతలైన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఒకవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు మరోవైపు తమ తమ శైలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై స్పందించినట్లుగానే తాజాగా గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశంలో అంతేస్థాయిలో స్పందించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతోపాటు ప్రజల్లో చర్చకు దారితీసింది. హిల్ట్ పాలసీ, కృష్ణా నదీ జలాల అంశం, ఫోన్ ట్యాపిం గ్, యూరియా, రైతు సమస్యలతోపాటు జాబ్ క్యాలెండర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

ప్రజల్లో చర్చకు దారితీసేలా పోరాటాలను ఉధృతం చేశారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలను లేవనెత్తుతూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ పథకంపై కాంగ్రెస్ చేస్తున్న నిరసనలను ధీటుగానే ఎదుర్కొన్నారనే చర్చ పార్టీ శ్రేణుల్లో ఉంది. అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ బహిష్కరించడంతో వారి స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది.

మున్సిపల్‌పై గురి

బీజేపీ నాయకత్వం మున్సిపల్ ఎన్నికలపై గురి పెట్టింది. సంక్రాం తి తర్వాత జరిగే మున్సిపల్ ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేలా కమలం పార్టీ సమాయత్తం అవుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లను సాధించిన బీజేపీ.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అంతకంటే ఎక్కువగా సీట్లను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే క్యాడర్‌ను సిద్ధం చేస్తోంది.

ఇటీవల జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో రాష్ట్ర నాయకత్వాని కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత రాష్ట్ర ఇన్‌చార్జ్ చంద్రశేఖర్ తివారి దిశానిర్దేశం చేశారు. స్థానికంగా ఉంటూ, ఎప్పటిక ప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేయ డం ద్వారానే రాణిస్తామని వారికి సూచించడంతో క్యాడర్ అంతా స్థానికంగా ఉంటూ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.

బూత్ స్థాయి నుంచే పార్టీ బలోపేతం చేస్తూ వస్తున్నారు. బూత్, మండల కమిటీలు, జిల్లా కమిటీలను పకడ్బందీగా వేయాలని నిర్ణయించింది. జిల్లా స్థాయిలోనూ పార్టీ వర్క్‌షాపులను నిర్వహించుకుని పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాలని దిశా నిర్ధేశం చేశారు. మున్సిపాలిటీకి ఒక ఇన్‌ఛార్జ్‌తోపాటు ఎన్నికల కో ఆర్డినేటర్లను నియమించనుంది.

అర్బన్ నుంచి రూరల్..

బీజేపీ తన గ్రాఫ్‌ను పెంచుకుంటున్నది. అర్బన్ పార్టీగా పేరున్న బీజేపీ ఇ టీవల కాలంలో గ్రామాలకు కూడా వెళ్లింది. దీనికి ఉదాహరణ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలే. గతంలో కంటే భారీగా ఈసారి బీజేపీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను గెలుచుకుం ది. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే పార్టీకి బలం, ఓటు బ్యాంకు ఉండేది. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, నిర్ణయాలతో బీజేపీవైపు ప్రజలు ఆలోచింపజేసేలా అంశాలు ఉం టున్నాయి.

దీంతో బీజేపీ అంటే అర్బన్ పార్టీ అనే ముద్రను చెరిపేసుకుని గ్రా మాల్లోనూ జెండాను, క్యాడర్‌ను నిలబెట్టుకోవడంలో విజ యం సాధిస్తుంది. ఇప్పుడు దాదాపు అన్ని గ్రామాల్లో బీజేపీకి ఎంతో కొంత క్యాడర్ ఉంది. ప్రజా సమస్యలపై ఆ పార్టీ చేస్తున్న పోరాటం, స్పందిస్తున్న తీరే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.