calender_icon.png 26 July, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల దుకాణాలు తనిఖీ

25-07-2025 05:44:22 PM

హాజీపూర్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు శుక్రవారం హాజీపూర్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను మండల స్థాయి టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువులు, యూరియా అమ్మే డీలర్ దుకాణాలను తనిఖీ చేశారు. గోదాములలో యూరియా బస్తాల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈపాస్ మెషీన్ లో అమ్మకాల వివరాలు పరిశీలించారు. రైతు ఆదార్ కార్డుతో ఈపాస్ మెషీన్ లో నమోదు చేసి, యూరియానీ విక్రయించాలని, పంట విస్తీర్ణం ప్రకారం మాత్రమే యూరియా రైతులకి ఇవ్వాలనీ, యూరియా, డిఏపికి బదులుగా తక్కువ ఖర్చులో ఉన్న  ద్రవ యూరియా, ద్రవ డీ ఏ పీ ని రైతులు వాడే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. మండల స్థాయి టాస్క్ ఫోర్స్ టీంలో మండల వ్యవసాయ అధికారి కృష్ణ, తహసిల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే, ఎస్సై అమృత్ రాజ్ సిబ్బంది తదితరులు ఉన్నారు.