calender_icon.png 26 July, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'బంజారా భరోసా ఫౌండేషన్' సేవలు అభినందనీయం

25-07-2025 05:41:10 PM

మండల విద్యాధికారి నకరికంటి రవి

పెన్ పహాడ్: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోని కౌమరా విద్యార్థినీలకు బంజారా భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన సానిటరీ ప్యాడ్స్ ను మండల విద్యాధికారి నగరికంటి రవి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నకిరేకంటి రవి  మాట్లాడుతూ..  ఆడపిల్లల శరీరక వ్యవస్థలో భాగంగా పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించడానికి సానిటరీ పాడ్స్ వాడకాన్ని ప్రోత్సాహించడానికి ముందుకొచ్చిన బంజారా భరోసా ఫౌండేషన్ సేవలు అభినందనీయం అన్నారు. పాఠశాల కౌమర బాలికలకు సానిటరీ పాడ్స్ పంపిణీ చేసిన బంజారా భరోసా ఫౌండేషన్ అధ్యక్షులు ధరావత్ గోపాల్ గారిని మరియు పౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ఫౌండేషన్ అధ్యక్షులు ధరావత్  గోపాల్ గారు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల ఆరోగ్యం పరిశుభ్రత లను ప్రోత్సహించే విదంగా  తన కుమార్తె ప్రీతి సూచన మేరకు శానిటరీ పాడ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ప్రీతి బాయ్,  ఫౌండేషన్ సభ్యులు లీలాబాయి, న్యూ బంజారా హిల్స్ తండా మాజీ ఉపసర్పంచ్ గుగులోతు రవి నాయక్, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.