12-08-2025 07:42:05 PM
జిల్లా గ్రంధాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడ్..
ముస్తాబాద్ (విజయక్రాంతి): ముస్తాబాద్ మండల కేంద్రంలో తాత్కాలిక గ్రంథాలయమును జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్(District Library Chairman Nagula Satyanarayana Goud) తనిఖీ చేశారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బాల్ రెడ్డి, రాజు పాల్గొన్నారు. అనంతరం జిల్లా చైర్మన్ మాట్లాడుతూ... త్వరలోనే ఈ తాత్కాలిక భవనంలో పూర్తిస్థాయి సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు విద్యావంతులకు నిరుద్యోగులకు కావలసిన మెటీరియల్ అందుబాటులోకి తెస్తామన్నారు. మన జిల్లాలోని ప్రతి మండలంలో గ్రంథాలయాలు పూర్తిస్థాయి వినియోగంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి విన్నవించామని వెంటనే వారు కూడా స్పందించి ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి నిధుల విడుదల కోసం సూచించారు. 15 నుండి నెలరోజుల సమయంలోపలనే అన్ని మండలాల్లో పూర్తిస్థాయిలో బుక్స్ అందుబాటులో ఉంచి తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ప్రశాంత్, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీవిజయ్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఎద్దండి మహేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు వనిత, ఎన్ఎస్ యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను తదితరులు పాల్గొన్నారు.