25-07-2025 02:47:51 PM
వలిగొండ, జులై 25 (విజయక్రాంతి): గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులు మమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగిస్తూ బంతి, టమాటా, మిరప నారు కోసం గత రెండు రోజులుగా రైతులు జనం ఎదురుచూస్తున్నారు. కాగా ప్రతి శుక్రవారం వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించే సంత సందర్భంగా బంతి,టమాట, మిరప నారు రాగా రైతులు, జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో బంతి,టమాటా,మిరప నారు క్షణాల్లో అమ్ముడుపోయింది. అయితే ఇతర గ్రామాల నుండి వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించే సంతలో వివిధ రకాల నార్లు దొరుకుతాయని ఇతర గ్రామాల నుంచి రైతులు జనం రాగా వారికి దొరకకపోవడంతో నిరుత్సాహంగా తిరిగి వెళ్లారు.