18-08-2025 01:01:02 AM
ముద్విన్‌లో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
కడ్తాల్, ఆగస్టు 17, : బహుజనుల పౌరుషానికి ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న స్ఫూర్తి ప్రధాత అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. ఆదివారం కడ్తాల్ మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహుజన వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,
ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, టాస్క్ సి, ఓ.ఓ. సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, పొల్యూషన్ కమిటీ సభ్యులు బాలాజీ సింగ్, బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తుళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులతో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్ర ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బహుజనులను ఏకం చేసి రాజ్యాధికారం దిశగా అడుగులు వేసిన సర్వాయి పాపన్న అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని వారు కోరారు. ఆత్మగౌరవం, సమానత్వం,సమాజ శ్రేయస్సుకు ఉత్తమమని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం మొఘల్ వలసవాదుల ఆధిపత్యానికి నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, అనేక అణచివేతల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
విగ్రహ ప్రతిష్టాపన బహుజనుల ఆత్మగౌరవానికి అద్దం పట్టడమే కాకుండా, సర్వాయి పాపన్న త్యాగాలు, ఆశయాలను, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయని వారు కొనియాడారు. కార్యక్రమంలో మార్కేట్ చైర్ పర్సన్ యట గీత నరసింహ, వైస్ చైర్మన్ గుడురు భాస్కర్ రెడ్డి,రాష్ట్ర గౌడ సంఘం నాయకులు బాలరాజు గౌడ్ వెంకన్న గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దుర్గయ్య గౌడ్, యాదయ్య గౌడ్, వినోద్ గౌడ్, పట్నం నరసింహ గౌడ్, నాయకులు మాజీ జెడ్పిటిసిలు దశరథ ఉప్పల వెంకటేష్ విజితా రెడ్డి, గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి,పాపిశేట్టి రామ్, తదితరులు పాల్గొన్నారు.