calender_icon.png 10 July, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

10-07-2025 05:34:24 PM

చండూరు (విజయక్రాంతి): చండూరు మున్సిపాలిటీలోని అయ్యప్పనగర్, సర్దార్ కాలనీ, హైదరాబాద్ రోడ్లో గత 5 సంవత్సరాలుగా లోవోల్టేజ్ సమస్యలతో బాధపడుతున్నామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) దృష్టికి తీసుకుపోయారు. స్పందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను మంజూరు చేశారు. ట్రాన్స్ ఫార్మర్ ను బిగించి గురువారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సౌకర్యార్థం మేరకే అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ దోటి సుజాత-వెంకటేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ లు కల్మికొండ పారిజాత-జనార్ధన్, నల్లగంటి మల్లేశం, గంట సత్యం, కల్లెట్ల మారయ్య, గండూరిజనార్ధన్, ఇరిగి వెంకటేశం, పన్నాల లింగయ్య, గజ్జెల కృష్ణారెడ్డి, జవీద్,  విద్యుత్ లైన్మెన్  ఎండి.షరీఫ్ పాషా, తదితరులు పాల్గొన్నారు.