10-07-2025 05:31:01 PM
మంచిర్యాల వాసికి డాక్టరేట్..
మంచిర్యాల (విజయక్రాంతి): విద్యారంగ సమస్యలపై 27 సంవత్సరాలుగా పోరాడుతూ పరిష్కారానికి, సంఘ బలోపేతానికి కృషి చేసిన, కరోనా కాలం నుంచి చేస్తున్న సేవలను హోప్ థియోలాజికల్ యూనివర్సిటీ(Hope Theological University) గుర్తించి మంచిర్యాల వాసి, విద్యావేత్త రాపోలు విష్ణువర్ధన్ రావుకి డాక్టరేట్ పురస్కారం అందజేశారు. 1998లో ప్రైవేట్ కళాశాలలో గణిత అధ్యాకునిగా విద్యా బోధన ప్రారంభించి ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు కృషి చేసి, 2003లో ప్రైవేట్ కాలేజీ స్థాపించారు. 2011 నుంచి రివిలేషన్ పాఠశాలను నడిపిస్తూ, 2024లో గుడిపేటలో రివిలేషన్ ఫ్యూచర్ మైండ్స్ పాఠశాలను స్థాపించి విద్య సేవలు అందించారు.
తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం(TPJMA జిల్లా అధ్యక్షునిగా ప్రైవేట్ జూనియర్ కాలేజీల సమస్యలపై పోరాటం చేశారు. తర్వాత మంచిర్యాల జిల్లా తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(TRSMA )జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో సేవలు అందించారు. విష్ణు వర్ధన్ రావు సేవలను గుర్తించిన హోప్ ఆఫ్ థియలాజికల్ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రధానం చేశారు. డాక్టరేట్ ను అందుకున్న రాపోలు విష్ణువర్ధన్ రావును జిల్లాలోనీ విద్యాసంస్థల యాజమాన్యాలు పుష్పగుచ్చాలు, శాలువాలతో ఘనంగా నిర్వహించారు.