27-05-2025 12:00:00 AM
ఖమ్మం, మే 26(విజయక్రాంతి): విద్యుత్ సరఫరా వ్యవస్థలో 33 కె. వి./ 11 కె. వి. సు దూరమైన లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం సూప రిండెంట్ ఇంజనీర్ శ్రీనివాసచారి సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రేక్ డౌన్ సమయంలో, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాల వలన లైన్ మొత్తం తనిఖీ చేసే అవసరం లేకుండా, విద్యుత్ అంతరాయా లు కలిగిన భాగాన్ని ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్ విభజిస్తుందన్నారు.
ఈ పరికరం ద్వారా విద్యుత్ అంతరాయం ఏ భాగంలో జరిగిందనే విషయాన్ని వెంటనే విశ్లేషించి, అక్కడికే వెళ్లి అట్టి విద్యుత్ అంతరాయాన్ని పున్నరుద్ధరణ చర్యలు చేపట్టడం ద్వారా విద్యుత్ అం తరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు.ఇట్టి ప్రాముఖ్యత గల ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను 33కె. వి / 11కె. వి. వి ద్యుత్ లైన్లలో అంతరాయాలు గుర్తింపు, వా టి నివారణ ప్రక్రియను వేగవంతం చేయుటకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇప్పటి వ రకు జిల్లాలోని 18 విద్యుత్ ఫీడర్లలో, ఎఫ్ పి ఐ లను బిగించడానికి సాంకేతికంగా వ్యూహాత్మక 79 ప్రదేశాలను గుర్తించి సంబంధిత ప్రతిపాదనలు మంజూరి చేయడం జరిగిందన్నారు.
మొట్టమొదటిసారిగా మధిర నుం చి ఎర్రుపాలెం వరకు వెళ్ళు 40 కిలోమీటర్ల, 33కె వి లైన్లో , ఐదు ప్రదేశాలలో , 33/11 కెవి సబ్ స్టేషన్ జానకిపురం నుండి వెలువడే గొల్లపూడి ఫీడర్లో మరో ఐదు ప్రదేశాలలో ఏర్పాట్ల ను పర్యవేక్షించడం జరిగిందన్నారు. త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో ప్రారంభం చేయుటకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.