27-05-2025 12:00:00 AM
-గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ పేస్ 1 నుంచి సాగునీరు విడుదల
-గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి
గద్వాల, మే 26 ( విజయక్రాంతి ): గ ద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోనీ గుడ్డెందొడ్డి గ్రామ సమీపంలో నెట్టెం పాడు ఎత్తిపోతల పథకం పేస్-1 పంపూహౌ స్ నుండి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం పంప్ హౌస్ ను స్విచ్ ఆన్ చేసి సాగు నీటిని విడుదల చేశారు .అనంతరం గంగమ్మ కు ప్రత్యేక పూజలు చేసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు....ఈ సంవత్సరం ముందస్తుగా వర్షాలు రావడం తో కృష్ణా నదిలో నీళ్లు సామర్థ్యం పెరగడంతో గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ద్వారా నీటి ని విడుదల చేయడం జరిగిందదన్నారు. ఈ సంవత్సరం రైతులకు రెండు పంటలకు నీళ్ల ను అందించడం జరుగుతుందని అధికారు ల సహకారంతో రైతులు రెండు పంటలు కూడా పండించుకోవడం జరుగుతుందన్నా రు.
రైతులు పండించిన వరి ధాన్యమును ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగిందని ఇప్పటివరకు 80% వరి ధాన్యములు ప్రభుత్వం కొనుగోలు చేసిన ఇంకా మిగిలిన వరి ధాన్యంలో 20% వరకు ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ర్యాలంపాడు రిజర్వాయ ర్లు నాలుగు టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు ప్రస్తుతం రెండు టీఎంసీల నీళ్లు నిలువ ఉండడం జరుగుతుందని .
త్వరలోనే రిజర్వాయర్ పనులను పూర్తి చేసి వచ్చే సం వత్సరానికి ర్యాలంపాడు రిజర్వాయర్లు నా లుగు టిఎంసిల నీళ్లు నిలువ ఉంచి రైతులకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జి ల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రా మన్ గౌడు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గద్వాల అభివృద్ధికి లక్ష్యంగా పనిచేస్తా..
గద్వాల, మే 26 ( విజయక్రాంతి ) : న న్ను గెలిపించిన ప్రజల కోసం గద్వాల ని యోజకవర్గ అభివృద్ధి కోసం నేను నిరంత రం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు నీటి పారుదల పైన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... జూ రాల, నెట్టంపాడు ఎత్తిపోతాల పథకం మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో పనులు ప్రారంభం చేయగా, మిగులు పనులు గత బిఆర్‌ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కొనసాగాయని భారీ ప్రాజెక్టులైనందున సమయం తీసుకుంటున్నాయని వాటిని నిర్మాణాలను ఆపితే మన రైతాంగం నష్టపోతుందని కొనసాగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాలు చేపడుతున్నామని అభివృద్ధిని కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఎగువ ప్రాజెక్టులలో డ్యామ్ లలో నీళ్లు లేక మార్చి, ఎప్రీల్ నెలలో నీళ్లు అందక పంటలు ఎండిపోయే పరిస్థితికి బాధాకరమన్నారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రినీ, ఉప ముఖ్యమంత్రిని కలసి నీటి ఏద్దడి రాకుండా తెలంగాణ మంత్రుల ఆధ్వర్యంలో కర్ణాట రాష్ట్రానికి వెళ్లి నీళ్లు విడుదల చేయించడం జరిగిందన్నారు.
150 కిలోమీటర్లు దూరం లో ఉండే నారాయణపురం డ్యామ్ నుండి 1 టిఎంసి నీటిని విడుదల చేస్తే అక్కడి నుం డి ఇక్కడికి వచ్చే వరకు ట(సగం) టిఎంసీ నీళ్లు రావడం బాధాను కలిగించిందన్నారు. భవిష్యత్ లో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకోకుంటే గ ద్వాల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉందని, 1.5 టిఎంసిల సామర్ధ్యం కల్గిన గుడ్డందొడ్డి రిజర్వాయర్ ను 20 టిఎంసీలు నిల్వచేసే లా ప్రపోజల్ పంపడానికి నమూనా చిత్రికరణ చేయడానికి 16 లక్షలు 20 వేల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.
గద్వా ల నియోజకవర్గ పరిధిలోనీ రైతులు అన్ని రకల పంటలను సాగుచేయడం గద్వాల ప్ర త్యేకతనీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు తగినంత సాగునీరు అందించాలని అనుకున్నానని దానికి అనుగుణంగానే పనులు చేస్తున్నానన్నారు.
తగిన స్థాయిలో విద్యుత్ సబ్ స్టేషన్ లను నిర్మిస్తున్నామని, రైతులు ఆశించిన విధంగా ముందుగానే వా తావరణం అనుకుంలించదని రైతులు వ్యవసాయధికారుల సూచన మేరకు పంటలు సాగుచేసుకుని పంటలు నష్టపోకుండా చూ సుకోవాలన్నారు. ప్రాజెక్టుల క్రింద పూర్తి స్థా యిలో ల్యాండ్ అక్యూర్ చేయలేదని త్వరలోనే నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో త్వరిత గతిన ల్యాండ్ అక్యూర్ చేయాలనీ కోరినట్లు తెలిపారు.
దేశానికి ఇక్కడ నుండి 40 శాతం సీడ్ అందించే పత్తి క్రాప్ పక్క రాష్ట్ర నికి తరలివెళ్లడం జరిగిందని ఇందిరమ్మ ఇల్లు జూన్ 2వ తేదిన ప్రారంభం చేయడం జరుగుతుందన్నారు. నా వ్యక్తిగత ప్రయోజనాలు ము ఖ్యం కాదని ప్రజల అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని ఏ పార్టీలో ఉన్న గద్వాల అభివృద్దే ధ్యేయంగా నేను ముందుకు వెళ్తున్నా ని ఎమ్మెల్యే వెల్లడించారు.
ఈ కార్యక్రమం లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర వ హనుమంతు, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు ఉరుకుందు, తిక్కన, ఖాజా, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.