calender_icon.png 6 July, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారసుడి ఎంపికపై రగడ

06-07-2025 01:06:54 AM

టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియ వివాదంగా మారుతోంది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని దలైలామా తేల్చి చెప్పగా..

టిబెట్‌ను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తున్న చైనా మాత్రం దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియ తమ కనుసన్నల్లోనే జరుగుతుందని పేర్కొంది. భారత్ మాత్రం 15వ దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియ ప్రస్తుత బౌద్ధ మత గురువు దలైలామా చేతుల్లోనే ఉందని స్పష్టం చేసింది.