03-08-2025 12:40:17 AM
జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): నగరంలో యాంటీ లార్వా కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కూకట్‌పల్లి జోన్ పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లో గల భూ లక్ష్మీనగర్, మచ్చబొల్లారం, భూదేవి నగర్ ప్రాంతాలలో మాన్సూన్ శానిటేషన్, యాంటీ లార్వా కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ నివాసితులతో మా ట్లాడి, చెత్త సేకరణ, యాంటీ లార్వా చర్యలు, కాలనీలో ఎదురవుతున్న ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వల్నరబుల్ పాయిం ట్ల వద్ద పేరుకుపోయిన చెత్త లేదా భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే,
వాటిని వెంటనే వాట్సాప్ నంబర్ 81259 66586 కు ఫోటో ద్వారా పంపితే తక్షణమే పరిష్కారం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఏఎం అండ్ హె ఓ, ఎస్‌డబ్ల్యూఎం అధికారులు పాల్గొన్నారు.