calender_icon.png 26 October, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు మద్యం షాపుల లక్కీ డ్రా

26-10-2025 12:56:16 AM

  1. తుది తీర్పునకు లోబడే లైసెన్స్ కేటాయించాలన్న హైకోర్టు 
  2. మద్యం టెండర్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీసేందుకు రాష్ట్ర హైకోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఈనెల 27న మద్యం దుకాణాల డ్రాలు తీసే కార్యక్రమం సాగనుంది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఈ డ్రా తీసే కార్యక్రమం నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో దుకాణం వారీగా వచ్చిన దరఖాస్తుల నుంచి డ్రా (లాటరీ) పద్ధతిలో మద్యం దుకాణాలకు లైసెన్స్ ల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. 

ఏ నిబంధనల ప్రకారం దరఖాస్తు గడువు పొడిగించారు?

తెలంగాణ మద్యం టెండర్లపై శనివారం హైకోర్టులో వాదనలు ముగిసిన అనంతరం హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మద్యం టెండర్ల గడువు పొడిగింపును సవాల్ చేస్తూ ఐదుగురు వ్యాపారులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈనెల 18 నుంచి 23 వరకు రూ.5 వేల దరఖాస్తులే వచ్చాయని, గడువు పొడిగించడం ప్రభుత్వ విధానపరమైన అంశమని ఏఏజీ న్యాయస్థానానికి విన్నవించారు.

పూర్తి వాదనలు విన్న హైకోర్టు ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని ప్రశ్నించింది. దీనిపై లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఏఏజీ కోర్టుకు తెలిపారు. సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు కానీ.. కోర్టు తుది తీర్పునకు లోబడి దుకాణాలకు లైసెన్స్ కేటాయించాలని ఆదే శించింది. తెలంగాణలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా.. దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించారు.

అయితే రాష్ట్రంలో బీసీ బంద్, బ్యాంకుల బంద్‌లతో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఫిర్యాదులు రావడంతో మద్యం షాపుల దరఖాస్తుల గడవును మరిం త పెంచాలని ఎక్సైజ్ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ పిటిషన్‌పై అత్యు న్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.