21-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 20 :పాఠశాల స్థాయిలో క్రీడానైపుణ్యాన్ని వెలికితీసే ఉద్దేశంతో నిర్వహించిన తెలంగాణ ఇంటర్ స్కూ ల్ చాంపియన్‌షిప్ 2025 ఘనంగా ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి యువ క్రీడాకారులు ఈ చాంపియన్‌షిప్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగిం పు వేడుకలకు మల్కాజగిరి ఎంపి ఈటల రా జేందర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మూడురోజుల పాటు ఎటువంటి ఇ బ్బందులు లేకుండా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించిన కన్వీనర్ కె మహేశ్వర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి వెంకటేశ్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. యువ అథ్లెట్లకు చక్కని వేదికగా ఈ చాంపియన్‌షిప్ నిలిచిందని సిఈవో భవాని ప్రసాద్ చెప్పారు. 2030 కామన్‌వెల్స్ గేమ్స్, 2025 ఒలింపిక్స్‌కు పతకాలు సాధించే అథ్లెట్లను గుర్తిం చడమే లక్ష్యంగా దీనిని నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ పోటీలు విజయవంతం చేసిన అథ్లెట్లు, కోచ్‌లు, అధికారులు, వాలంటీర్స్, క్రీడాకారుల తల్లిదండ్రులు, క్రీడాసంఘాల ప్రతినిధులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.