16-05-2025 07:12:38 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏకలవ్య (ఈఎంఆర్ఎస్) మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో 2025 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశం కోసం ఈ నెల 27న కురవీ ఏకలవ్య పాఠశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అజయ్ సింగ్ తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు ఎస్ ఎస్ సి మెమో, బయోడేటా, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో ఏకలవ్య కొత్తగూడ విద్యాలయంలో ఈనెల 15 నుండి 24 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకొని పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు 27న మహబూబాబాద్ జిల్లాలోని కురవి ఏకలవ్య పాఠశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొనేందుకు అవకాశం ఉందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 97173 20985 నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఎంపీసీ, బైపిసి, హెచ్ ఈ జీ గ్రూపుల్లో కలిపి 34 సీట్ల భర్తి కోసం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.