calender_icon.png 23 August, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ కాలేజీలో ఉచిత వైద్య శిబిరం

23-08-2025 04:52:56 PM

ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అశ్విని హాస్పిటల్, ఎన్‌.ఎస్‌.ఎస్‌ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో విద్యార్థులకు రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, బిపి, హిమోగ్లోబిన్‌ తదితర పరీక్షలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. పద్మావతి మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ఇది ఎంతో ఉపయుక్తమని, ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేపడతామని తెలిపారు. డాక్టర్లు గోవర్ధనం సత్యనారాయణ స్వామి, అభినయ్, వైద్యసిబ్బంది, అధ్యాపకులు, ఎన్‌.ఎస్‌.ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.