calender_icon.png 23 August, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల శ్రమధానం.. స్పందించిన కేటీఆర్

23-08-2025 04:54:44 PM

ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): ఎగువ మానేరు ప్రాజెక్టు నీరు ఉప్పొంగుతున్న సమయంలో, సింగ సముద్రం చెరువుకు వచ్చే నీరు కాల్వలోని మరమ్మతులు చేయాల్సిన అవసరం తలెత్తింది. రెండు మూడు రోజులుగా రైతులు అధికారులకు విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతో… చివరికి రైతులే శ్రమధానం చేయడానికి రంగంలోకి దిగారు. సమాచారం తెలుసుకున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వెంటనే స్పందించారు.

కాల్వలో ఉన్న పూడికతీత, పొదల తొలగింపు, గడ్డి, తుంగ తొలగింపు వంటి పనులకు అయ్యే మొత్తం ఖర్చును పార్టీ తరఫున భరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఈ కాల్వ ద్వారా వచ్చే నీరు గొల్లపల్లి, బొప్పాపూర్ వంటి పక్కా గ్రామాల రైతులకు ప్రాణాధారం. సింగ సముద్రం నిండితే జక్కుల చెరువు, గాలం చెరువు, గిద్ద చెరువు కూడా నిండుతాయని రైతులు పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తూ, శనివారం స్వయంగా పూడికతీత పనులు ప్రారంభించారు. కాల్వలో నీరు వృథా కాకుండా ఉండేందుకు 500 మట్టిబ్యాగులు వేసి నీటిని మళ్లించారు. తూమును మూసి, రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.