calender_icon.png 23 August, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రిపై నిప్పులు చెరిగిన ఎంఎస్ఆర్

23-08-2025 04:35:58 PM

-మంత్రిగా చేశారు... కనీసం అవగాహన లేకుంటే ఎట్లా 

-పదేళ్ల పాలనలో చేసిన అన్యాయాన్ని బహిర్గతం చేస్తాం 

- పాపాల పుట్ట చెప్పలేదు.. త్వరలో చెబుతాం 

- విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేత సురేందర్ రెడ్డి ఆగ్రహం 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రైతులపై కపట ప్రేమ చూపిస్తూ కాలం గడుపుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీరు మార్చుకోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి(Congress leader Surender Reddy) నిప్పులు చేరిగారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎస్ఆర్ మాట్లాడారు. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర యూరియా విక్రయ కేంద్రం దగ్గరికి వచ్చి ఆంజనేయులు కాకర్లపాడు గ్రామానికి చెందిన రిక్షా నడిపే వ్యక్తికి మూర్చ రావడంతో అక్కడే కొంతమంది చుట్టుపక్కల వారు అక్కడ పండబెట్టారు. ఈ తరుణంలో మాజీ మంత్రి వచ్చి యూరియా కోసం రైతు పడిగాపులు కాస్తు పడిపోయారని అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి పంపించారని తెలిపారు. అంబులెన్స్ ఆహ్వానించి నేనే ఈ అంబులెన్స్ ని తెప్పించానని చెప్పుడంతో పాటు ఆంజనేయులును రైతు అని చెప్పడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

రాష్ట్రానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, 4 నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావలసి ఉందని, జిల్లా నుంచి 38వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ప్రతిపాదన పంపించడం జరిగిందని, ఇప్పటివరకు 20,000 మెట్లు టన్నుల యూరియా వచ్చిందన్నారు. రామగుండం దగ్గర యూరియా తయారీ కేంద్రం ఉన్నప్పటికీ అది సెంట్రల్ పరిధిలో ఉంటుందనే విషయం కూడా మంత్రిగా చేసిన మీకు తెలియకపోవడం శోచనీయమన్నారు. గూడ్స్ రైలు ద్వారా వివిధ ప్రాంతాల నుంచి యూరియా రావాల్సి ఉంటుందని వర్షాలు కురవడం ద్వారా రాకపోకలకు అంతర్యం కలిగిందన్నారు. కేంద్రం పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పై నిందలు వేయడం సరికాదన్నారు. 

మాజీమంత్రి అవినీతి పుట్టను బహిర్గతం చేస్తాం 

మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆడవాళ్లు కూడా లేకుండా తుడిచి పెట్టుకుపోయే రోజులు వచ్చేస్తాయని, త్వరలో ఆయన చేసిన మోసలను పూర్తిస్థాయిలో బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. బిజెపి పార్టీలో రంగ ప్రవేశం చేసినందుకు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో అక్కడ వారు అతను పార్టీలోకి వస్తే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతాయని చెప్పడంతో ఆపడం జరిగిందన్నారు. బిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని నమ్ముకుని ఎవరు ఉండకూడదని, వాస్తవాలను తెలుసుకొని మీ మంచి కోరే చెబుతున్నా బయటికి రావాలని సూచించారు. అందరం కలిసిమెలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అద్భుతంగా ఆవిష్కృతం చేసుకుందామని సూచించారు. ఇది సందర్భం కాదు కాబట్టి మాజీ మంత్రి అవినీతి పుట్టను బహిర్గతం చేయడం లేదని, త్వరలో పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తామన్నారు.

మునిగిపోయే నౌకలో ఉండి ఏమీ ఉపయోగం ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ రాబోయే ఎన్నికల్లో నాకున్న సమాచారం మేరకు ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం అనే మాటకు తావు లేకుండా ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందుకు సాగుతున్నామని రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్,  కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరాజ్ ఖాద్రీ, ప్రచార కార్యదర్శి బెనహర్ తదితరులు ఉన్నారు.