calender_icon.png 23 August, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురవరం సుధాకర్ రెడ్డికి సిపిఎం నివాళి

23-08-2025 04:32:29 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఐ మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సమావేశాన్ని నిర్వహించారు. సురవరం చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు(CPM District Secretary Ramesh Babu) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండి ఆయన కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలతో ప్రజల పక్షాన జీవితాంతం పనిచేసే అనేక పోరాటాలు నిర్వహించారని, అటు పార్లమెంట్లో ఇటు బయట కష్టజీవుల సమస్యలపైన నిరంతరం కృషి చేశారని కమ్యూనిస్టుల ఐక్యత కోసం కృషి చేశారని ఆయన అన్నారు. 

సాధారణ జీవితాన్ని గడుపుతూ అనేకమంది యువ నాయకులకు ఆదర్శంగా నిలిచారని చివరి వరకు కమ్యూనిస్టు విలువలకు కట్టుబడి కృషి చేయటం నేటి యువత ఆచరించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఆయన చివరివరకు మతోన్మాదానికి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా అవిరామంగా కృషి చేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తితో భవిష్యత్ తరాలు మతోన్మాద విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించినప్పుడే ఆయన ఆశయాలను కొనసాగించిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, నగర నాయకులు కటారి రాములు, రాజు, చక్రి తదితరులు పాల్గొన్నారు.