26 February, 2026 | 2:14 AM

యూరియా యాప్ వినియోగంలో సిద్దిపేట జిల్లా ముందంజ

26-02-2026 12:24 AM

రైతులు మరింత సద్వినియోగం చేసుకోవాలి

ఫార్మర్ రిజిస్ట్రేషన్ వల్ల అధిక ప్రయోజనాలు

జిల్లా వ్యవసాయ అధికారిణి స్వరూప రాణి

గజ్వేల్, ఫిబ్రవరి 25 : ప్రభుత్వం యూరియా క్రయావిక్రయాల్లో పారదర్శకతను పాటించేందుకు తీసుకువచ్చిన యూరియా యాప్ వినియోగంలో సిద్దిపేట జిల్లా ముందంజలో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి అన్నారు. బుధవారం గజ్వేల్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. యూరియా యాప్ వినియోగం వల్ల రైతులు పండిస్తున్న పంటను బట్టి ఎంత అవసరమో అంతవరకే యూరియా పంపిన జరుగుతుందని, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు.

ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా రైతులు యూరియా యాప్ ను వినియోగిస్తూ 8300 మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 3,61000కి పైగా మంది రైతులు ఉన్నారని వారికి కూడా అధికారులు యాప్ వినియోగాన్ని వివరిస్తున్నట్లు తెలిపారు.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని, ఫార్మా రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల రైతులకు ప్రభుత్వ పథకాలు పొందుతాయన్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా రైతులు ఫార్మార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మిగతా రైతుల కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారులను సంప్రదించాలన్నారు. ఆమె వెంట ఏ డి ఏ బాబు నాయక్, ఏవో నాగరాజు లు ఉన్నారు.