12 March, 2026 | 12:26 PM

హేమాచల క్షేత్రంలో అంతర్గత కుమ్ములాట?

12-03-2026 12:31 AM
  1. వివాదాస్పదంగా మారుతున్న అధికారి తీరు

సిబ్బంది మధ్య లోపించిన సమన్వయం

ఆలయ ప్రతిష్ట పై భక్తుల ఆందోళన 

మంగపేట, మార్చి 11 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదగిరి గు ట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమా చల లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో పని చేస్తున్న కొంతమంది సిబ్బంది, అధికారులు, అనధికార అర్చకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లు ప్రచారం సాగు తోంది. శ్రీ హేమాచల లక్ష్మీనృసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

ఇలాంటి సమయంలో ఆలయంలో పని చేస్తున్న కొంతమంది, ఒకరిద్దరు నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయంలో పని చేస్తున్న కొంతమంది మధ్య సమన్వ యం లేకపోవడంతో వర్గ పోరు మరింత పె రుగుతూ అంతర్గత కుమ్ములాట తారా స్థా యికి చేరినట్లు విమర్శలు వెళ్ళు వెతుతున్నాయి. ఆలయంలో పని చేసేవారి విషయా లు, ఆలయంలో జరిగే కార్యక్రమాలు, అవకతవకలపై పలు రకాలుగా గత కొంత కా లంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆలయ ప్రతిష్టకి భంగం వా టిల్లే అవకాశం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. 

వివాదాస్పదంగా మారుతున్న అధికారి తీరు

ఆలయంలో, ఆలయానికి సంబందించిన సిబ్బంది, అర్చకుల విషయంలో ఓ అధికారి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉం డడంతో ఆ అధికారి తీరుపై విమర్శలు వినవస్తున్నాయి. ఆలయంలో పని చేస్తున్న వారి లో అంతర్గత కుమ్ములాటలను నివారించి సమస్య పరిష్కారం కోసం ఆ ఆధికారి ఏ మాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నాడని ఆరోపణలు సైతం వినవస్తున్నాయి.

 గ్రేడ్ 1 స్థాయి అధికారిని నియమించాలి: వీరేన్ కుమార్, బీజీపీ మండల మాజీ అధ్యక్షుడు

నిభందనల ప్రకారం శ్రీ హేమాచల లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి గ్రేడ్ 1 స్థాయి అధికారిని కార్యనిర్వాహణాధికారిగా నియమించాలి. ప్రస్తుతం ఉన్న కార్యనిర్వాహణా ధికారి గ్రేడ్ 3 స్థాయి అధికారి అని తెలుస్తుంది. గ్రేడ్ 1 స్థాయి అధికారికి సుదీర్ఘ అనుభవం ఉంటుండి, గ్రేడ్ 1 స్థాయి అధికారికి దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన అన్ని నియమ నిభందనలు, దేవాలయానికి చెందిన సిబ్బందితో ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై అవగాహన, పట్టు ఉంటుం డి. ప్రస్తుతం ఉన్న కార్యనిర్వాహణాధికారి గ్రేడ్ 3 స్థాయి అధికారి కావడంతో తగిన అనుభవం లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు కనబడుతుంది.

మే 1వ తేది నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నా యి, ఇలాంటి వివాదాలను అరికట్టకపోతే కష్టమే. ఈ విషయంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు తగిన రీతిన స్పందించి ఆలయంలో పని చేసే వారిలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలను, వర్గ పోరును అరికట్టాలని, ఆలయానికి ని భంధనల ప్రకారం గ్రేడ్ 1 స్థాయి అధికారిని కార్యనిర్వాహణాధికారిగా నియమించాలి. ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలి.