12 March, 2026 | 4:41 PM

కుల ధృవీకరణ పత్రాలపై విచారణ

12-03-2026 12:29 AM

మంగపేట, మార్చి 11 ( విజయక్రాంతి ) : మంగపేట మండలంలోని మల్లూరు గ్రా మంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన న లుగురు వ్యక్తులకు జారీ చేసిన కుల ధృవీకరణ పత్రాల విషయంపై బుధవారం మంగ పేట తహశీల్ కార్యాలయంలో తహశీల్దార్ తోట రవీందర్ విచారణ చేశారు. మల్లూరు గ్రామానికి చెందిన అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ, వై. ఈశ్వర్ చంద్, ముక్కామల వేంకట నారాయణ శర్మ, అనిపెద్ది మురళీ మోహన్ శర్మ అనే నలుగురు వ్యక్తులు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి నకిలీ కుల ధృవీకరణ పత్రాలు పొందారని,

వాటిని రద్దు చే యాలని కోరుతూ అదే గ్రామానికి చెందిన కైంకర్యం రాఘవాచార్యులు మంగపేట తహసీల్ కార్యాలయంలో గత ఏడాది డిసెంబర్ 29 న, జిల్లా కలెక్టర్ కు ఈ ఏడాది జనవరి 9న ఫిర్యాదు చేశారు. దీంతో మంగపేట తహశీల్దార్ తోట రవీందర్ బుధవారం మంగపేట తహసీల్ కార్యాలయంలో విచారణ చేశారు. విచారణలో భాగంగా భద్రాచ లం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం రిటైర్డ్ ప్రధాన అర్చకులు పొడిచేటి రామచంద్రాచార్యులు,

భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం స్థానాచార్యులు కో మాండూరు ఇళైవిల్లి స్థల శాయి, ఉప ప్ర ధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణాచార్యుల ద్వారా వివరాలు తెలుసుకుని వాం గ్మూలం తీసుకున్నారు. 2017 నవంబర్ 16 వ తేదిన మల్లూరు గ్రామానికి చెందిన వై. ఈశ్వర్ చంద్ అనే వ్యక్తి బ్రాహ్మణ కులంలో ప్రధమ శాఖ నియోగి , ముక్కామల వేంకట నారాయణ శర్మ అనే వ్యక్తి బ్రాహ్మణ కులంలో నియోగి,

అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ అనే వ్యక్తి 2018 ఫిబ్రవరి 21న బ్రా హ్మణ కులంలో నియోగి అని కుల ద్రువీకరణ పత్రాలు పొందారని ఫిర్యాదుదారుడు కైంకర్యం రాఘవాచార్యులు ఆధారాలతో సహా రెవెన్యూ అధికారులకు చూపించారు. అదే ముగ్గురు వ్యక్తులలో వై. ఈశ్వర్ చంద్, ముక్కామల వేంకట నారాయణ శర్మ అనే ఇద్దరు 2025 నవంబర్ 28 న, అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ 2025 నవంబర్ 25 న, అనిపెద్ది మురళీ మోహన్ శర్మ 2025 డిసెంబర్ 18 న బ్రాహ్మణ కులంలో శ్రీ వైష్ణవ అని కుల ధృవీకరణ పత్రాలు పొందారని ఆధారాలతో రెవెన్యూ అధికారులకు చూపించారు. 

ఈ విషయంపై తహశీల్దార్ తోట రవీందర్ ను వివరణ కోరగా ఫిర్యాదుదారుడు కైంకర్యం రాఘవాచార్యులు ఇచ్చిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, విచారణలో వై. ఈశ్వర్ చంద్, ముక్కామల వేంకట నారాయణ శర్మ, అనిపెద్ది రాజీవ్ నాగ శర్మ, అనిపెద్ది మురళీ మోహన్ శర్మలు తప్పుడు సమాచారంతో కుల ధృవీకరణ పత్రాలు పొందారని తేలితే అట్టి కుల ధృవీకరణ పత్రాలు రద్దు చేస్తామని, అట్టి కుల ధృవీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకోవద్దని ఎండోమెంట్ శాఖకు నివేదిస్తామని, అధికారులకు తప్పు డు సమాచారం ఇచ్చి కుల ధృవీకరణ ప్ర తాలు పొందిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.