31-12-2025 08:59:57 PM
పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల,(విజయక్రాంతి): నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నూతనంగా నిర్మించనున్న డ్రెయినేజీ నిర్మాణ పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బుధవారం శంకుస్థాపన చేశారు. డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో డ్రైనేజీ, సీసీ రోడ్ల పనుల నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశామని, నకిరేకల్ పట్టణంను దశల వారిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పట్టణంలోని సిసి రోడ్డు, డ్రైనేజీ పనుల నిర్మాణం కోసం 6 కోట్లుతో పనులు ప్రారంభించామని,100 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభిస్తున్నాం అని పేర్కొన్నారు.
ఆసుపత్రిలో ట్రామ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ కూడ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ కార్యాలయాలకు త్వరలో శంకుస్థాపన చేస్తామని, పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. నకిరేకల్ పట్టణంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరలో నిర్మాణం చేపడుతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత - శ్రీనివాస్,మాజీ వైస్ చైర్మన్ మూరారిశెట్టి ఉమారాణి - కృష్ణమూర్తి, కమీషనర్,మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.