21 March, 2026 | 8:06 AM

24న అంతర్జాతీయ మహిళా సదస్సు

21-03-2026 12:00 AM

హాజరు కానున్న ఆయా రంగాల మహిళా ప్రముఖులు

సికింద్రాబాద్, మార్చ్ 20 (విజయక్రాంతి): ఓయూ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం నమోదు కానుంది. గివ్ టు గెయిన్ మహిళా సాధికారత, మహిళా నా యకత్వం, మహిళల పురోభివృద్ధి, మహిళల సమగ్రాభివృద్ధి ఇతివృత్తంగా మూడు రోజుల పాటు భారీ స్థాయిలో అంతర్జాతీయ మహిళా సదస్సు (ఓయుఐ డబ్ల్యూ.సి 2026) నిర్వహించనున్నట్లు ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం ప్రకటించారు.

108 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఓయూ మరో అరుదైన కార్యక్రమానికి వేదిక కానుందని ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. విశ్వవిద్యాలయ చరిత్రలోనే మొదటిసారిగా మొద టి అంతర్జాతీయ మహిళా సదస్సు మార్చి 24 నుండి 26 వరకు ప్రతిష్టాత్మకమైన ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు.

ఈ సందర్భంగా మీడి యా సమావేశంలో ప్రొఫెసర్ కుమార్ మా ట్లాడుతూ గివ్ టు గెయిన్ మహిళా శక్తి సుస్థిరత‘ ఈ సదస్సు విద్యార్థులను కేవలం అ భ్యాసకులుగానే కాకుండా, సమాజానికి దిశానిర్దేశం చేసే నాయకులుగా తీర్చిదిద్దడంపై దృష్టి సారిస్తుందని, ఐకాస నిర్దేశించిన సుస్థిర అభివృ ద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా, విద్యా సిద్ధాంతాలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చ డమే సదస్సు ముఖ్య ఉద్దేశమని ప్రొఫెసర్ కుమార్ తెలిపారు.

ఈ సమావేశంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సి పాల్, అంతర్జా తీయ మహిళా సదస్సు సారథి ప్రొఫెసర్ విజ్జులత, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్‌రెడ్డి, ప్రొఫెసర్ ఎం.విజ్జులత, ఓఎస్‌డి ప్రొఫెసర్ ఎస్. జితేంద్ర కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.